![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్ 9లో అగ్నిపరీక్ష సీజన్ మొదలైంది. ఇక ఆ సీజన్ 1 లో టాప్ 15 కంటెస్టెంట్లలో ఒకడైన హరిత హరీష్ ఈ రోజు అగ్నిపరీక్ష సీజన్ 2 కి గెస్ట్ గా వచ్చాడు. హోస్ట్ శ్రీముఖి అతన్ని మాస్క్ మ్యాన్ నుంచి ఫైర్ మ్యాన్ అయిన హరీష్ అని పిలిచి స్టేజ్ మీదకు తీసుకువచ్చింది. జడ్జెస్ గా ఉన్న అభిజీత్, బిందు మాధవి, నవదీప్ ముగ్గురూ అతనికి స్టాండింగ్ క్లాప్స్ ఇచ్చారు. గత సీజన్ లో తన మాస్క్ లుక్ తో, స్ట్రైట్ ఫార్వర్డ్ మాటలతో ఫేమస్ అయిన హరీష్, ఆడిషన్స్ లో మిక్స్డ్ సిగ్నల్స్ తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాడు. ఈ సారి తను ఒక కామనర్ గా కాకుండా, ఒక సీనియర్ గా కంటెస్టెంట్లను టెస్ట్ చేయడానికి వచ్చానని చెప్పాడు.
అతను తనతో పాటు ఫైర్ కార్డ్ తీసుకువచ్చాడు. ఇది సాధారణ కార్డ్ కాదు.. ఈ కార్డ్ గెలిచిన వ్యక్తికి డైరెక్ట్ గా టాప్ 15 రేస్ లోకి ఒక అడుగు ముందుకు వెళ్లే ఛాన్స్ వస్తుంది. గత సీజన్ లో గోల్డెన్ చైర్ బ్యాటిల్ లాగా, ఈ కార్డ్ కోసం కంటెస్టెంట్లు తమ ఫిజికల్, మెంటల్ స్ట్రెంత్ చూపించాలి.. ఎంట్రీ తర్వాత జ్యూరీస్ తో హరీష్ కి హీటెడ్ కానీ ఫన్నీ కన్వర్జేషన్ జరిగింది. బిందు మాధవి..నువ్వు లాస్ట్ టైం మాస్క్ వెనుక దాక్కున్నావ్, ఈ సారి ఫైర్ తో వచ్చావా అని అడిగితే.. మేడం, మాస్క్ తీసేసాకే నా ఫైర్ బయటకు వచ్చిందని హరీష్ సమాధానమిచ్చాడు. నువ్వు ఇచ్చే కార్డ్ కి నిజంగా అర్హుడు ఎవరో నువ్వే డిసైడ్ చెయ్ అని నవదీప్ పూర్తి పవర్ అతనికే ఇచ్చాడు. అభిజీత్ మాత్రం.. కార్డ్ ఇచ్చే ముందు వాళ్ల లైఫ్ స్టోరీ విను అని సలహా ఇచ్చాడు.
హరీష్ తన టాస్క్ కోసం ఇద్దరు కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసుకున్నాడు. ఒకరు షాలిని మరొకరు జాన్సీ ఇద్దరికి టాస్క్ ఇస్తారు. జాన్సీకి బ్లూ కలర్ తాడు షాలినికి రెడ్ కలర్ తాడు ఇస్తారు. ఆ టాస్క్ లో మిగతా పదముడు మంది ఉంటారు. పోటీ పడే ఇద్దరు కంటెస్టంట్స్ తమకి సపోర్ట్ ఇవ్వమని కంటెస్టెంట్స్ కి తాడు కడతారు. బజర్ మొగే టైమ్ కి ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంటే వాల్లే విన్ అని అంటారు. అలా ఈ టాస్క్ లో జాన్సీ విన్ అవుతుంది. ఫైర్ కార్డ్ గెలుచుకుంటుంది. ఆ ఫైర్ కార్డ్ తనకి ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |